Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిమ్‌ జాంగ్ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి సరిగా లేద‌ట!

  • క్షిప‌ణి ప్ర‌యోగాలు చేస్తూ దూకుడును క‌న‌బ‌ర్చే ఉత్త‌ర కొరియా
  • రెండు నెల‌లుగా సైలెంట్
  • కిమ్ జాంగ్ ఉన్‌కి  మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు
క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తూ ఎల్ల‌ప్పుడూ దూకుడు మీదుండే ఉత్త‌రకొరియా ఇప్పుడు సైలెంట్ గా ఎందుకు ఉంటోంది? ఎన్ని హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నా, ఆంక్ష‌లు విధిస్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రి మాటా విన‌కుండా ముందుకు వెళ్లే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్ రెండు నెల‌లుగా క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌ను ఎందుకు చేయ‌డం లేదు? దీనికి కారణం, ప‌్ర‌స్తుతం కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడమే అని తెలుస్తోంది.

కిమ్ అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే ఆ దేశం క్షిపణి ప్రయోగాలను చేపట్టడం లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిమ్ జాంగ్ ఉన్‌కి మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయ‌ట‌. కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంతో ఉన్నార‌ని దక్షిణ కొరియా కూడా భావిస్తోంది. 
kimjong un
silent
health

More Telugu News